అవసాన దశలో అష్టకష్టాలు
పెన్షనర్లకు అడిషినల్ క్వాంటమ్ పెంచాలి
సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెన్షనర్లకు ఒక్క ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరలేదు. నెల నెలా పెన్షన్ ఇస్తున్నాం కదా .. మిగిలిన ప్రయోజనాలు ఇవ్వడం ఎందుకు అనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) చెల్లింపులు లేవు. ఎర్న్‌లీవ్‌ల పేమెంట్లు పెండింగ్‌లో ఉండి పోయాయి. డీఎన్‌ఎస్ రిలీఫ్ కూడా పెండింగ్ లోనే ఉంది.
కమిషన్ ఏర్పాటు చేసి ..
సిఫార్సుల అమలు మరిచి..
2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షనర్ల కోసం పే–రివిజన్ కమిషన్ ఏర్పాటు చేశారు. మార్కెట్ ధరలను అధ్యయనం చేసి విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అప్పటి కమిషన్ సిఫార్సులను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. అదే సిఫార్సులను ఆ తరువాత అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసి తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా పే–రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మెడికల్ రియింబర్స్‌మెంట్‌కు కూడా పెన్షనర్లు నోచుకోవడం లేదు. పెన్షనర్లు మరణిస్తే మట్టి ఖర్చులకు 24 గంటల్లో ట్రెజరీ అధికారులు రూ. 20 వేలు చెల్లించేవారు. మట్టి ఖర్చులకు ఇచ్చే ఆర్థిక సాయానికి కూడా నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
నేడు జాతీయ పెన్షనర్ల దినోత్సవం...
ఏటా డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్‌తోనే
సరిపెడుతున్న ప్రభుత్వం
ఎర్న్ లీవ్‌ల పేమెంట్ కోసం
పండుటాకుల ఎదురు చూపులు
జీపీఎఫ్ ఇస్తే ఒట్టు ..మట్టి ఖర్చులకూ దిక్కులేదు
మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఊసే లేదు
జిల్లాలో 10 వేల మంది
విశ్రాంత ఉద్యోగులు
నేడు జాతీయ పెన్షనర్ల దినోత్సవం
పెన్షనర్లకు పెన్షన్ మినహా ఇతరత్రా ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. ముఖ్యంగా పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం పెంచాలి. ఐదేళ్లకోసారి పెన్షనర్ల కోసం పే–రివిజన్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎర్న్‌లీవ్‌లకు పేమెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, డీఏలు వెంటనే చెల్లించాలి. నాలుగు డీఏలకుగాను ఒక్క డీఏ చెల్లించారు. జనవరికి మరో డీఏ కలవనుంది. జిల్లా వ్యాప్తంగా 10 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు.
– చొప్పర చిన్న ఆదెయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, పల్నాడు


