ప్రైవేటీకరణ దుర్మార్గం
ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మెరిట్ విద్యార్థులకు ఫ్రీ సీట్లు వస్తాయి. పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు వీలు ఉంటుంది. ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా రూ.20 లక్షలు, డొనేషన్ రూ.50 లక్షలు ఉంటుంది. ప్రభుత్వ పరంగా హాస్పిటళ్లు నిర్వహిస్తే పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం లభిస్తుంది. ప్రైవేటు హాస్పిటళ్లు అయితే పేదలపై విపరీతమైన భారం ఉంటుంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వమే కళాశాలలను నిర్వహించాలి.
–డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
జిల్లా అధ్యక్షులు,
వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం


