ఆర్‌బీఎస్‌కె కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేయాలి
పల్నాడు జిల్లా రాష్ట్రీయ బాలస్వాస్య అధికారి రాజేశ్వరి
నకరికల్లు: విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ఆర్‌బీఎస్‌కె కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేయాలని పల్నాడు జిల్లా రాష్ట్రీయ బాలస్వాస్య అధికారి రాజేశ్వరి ఆదేశించారు. మండలంలోని కుంకలగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. రికార్డులు పరిశీలించారు. ఆర్‌బీఎస్‌కె పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, ఎన్‌సిడిసిడి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఎన్‌సిడిసిడి సర్వే పురోగతిలేని సామాజిక ఆరోగ్య అధికారులకు స్వయంగా ఫోన్‌చేసి కారణాలు అడిగి తెలుసుకొని సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ 4డిలను జిల్లా డీఐఈసీ సెంటర్‌కు సిఫార్సు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.పూజాశ్రీ, ఆరోగ్య విస్తరణాధికారి కె.వెంకటేశ్వర్లు, ఆరోగ్య పర్యవేక్షకుడు షేక్.కరిముల్లా, స్టాఫ్ నర్స్ హసీనాబేగం, ఫార్మాసిస్ట్ కల్పన, సిబ్బంది పాల్గొన్నారు.


