ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్‌లో జిల్లాకు స్థానం
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర నూతన కార్యవర్గంలో పల్నాడు జిల్లాకు సముచిత స్థానం లభించినట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన 79వ ఎస్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారన్నారు. రాష్ట్ర కౌన్సిల్‌లో పల్నాడు జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శిగా సీహెచ్.అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా యూ.చంద్రజిత్‌యాదవ్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యునిగా షేక్ కరిముల్లా, అసోసియేట్ అధ్యక్షునిగా జె.గంగాధరబాబు, ఆర్థిక కార్యదర్శిగా కె.కోటేశ్వరరావులను ఎన్నుకున్నారని వివరించారు. పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం ఇస్తూ పాల్గొన్న ఎస్‌టీయూ ప్రతినిధులకు పల్నాడు జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులతోపాటు ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు, జిల్లా ఆర్థిక కార్యదర్శి షేక్ మహబూబ్ సుభాని, గౌరవాధ్యక్షుడు కె.ఏసయ్య తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్‌లో జిల్లాకు స్థానం
ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్‌లో జిల్లాకు స్థానం


