నిర్ణీత సమయంలో ఫిర్యాదులు పరిష్కరించాలి
నరసరావుపేట రూరల్: నిర్ణీత సమయంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, పలు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 101 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్‌ఎస్‌లో మహిళలు, వృద్ధులు ఇచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టితో వేగంగా విచారణ జరిపి చట్టప్రకారం న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.


