రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సత్తెనపల్లి: పౌర హక్కుల సంఘం రాష్ట్ర 20వ మహాసభలను జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సత్తెనపల్లిలోని బస్టాండ్ సెంటర్‌లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర 20వ మహసభల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘం పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించే క్రమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటుందన్నారు. సంఘం సీనియర్ నాయకులను రాజ్య హింసలో కోల్పోయి కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం సందర్భంలో నేడు పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ 20వ రాష్ట్ర మహాసభలను 2026వ సంవత్సరం జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్నామన్నారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శిఖినం చిన్న, పౌరహక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి వినుకొండ పేరయ్య మాట్లాడారు.
పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు


