బాలల బ్యాగు పట్టని బాబు! | - | Sakshi
Sakshi News home page

బాలల బ్యాగు పట్టని బాబు!

Dec 13 2025 7:46 AM | Updated on Dec 13 2025 7:46 AM

బాలల

బాలల బ్యాగు పట్టని బాబు!

శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 బాలల బ్యాగు పట్టని బాబు! పుస్తకాలు పెట్టుకునేందుకు విద్యార్థులకు తప్పని తీవ్ర కష్టాలు సత్తెనపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌లోని బ్యాగ్‌లు నాసిరకంగా ఉండటంతో పూర్తిగా చీకు పట్టి చినిగిపోయాయి. నిత్యం పుస్తకాలు పెట్టుకొని పాఠశాలకు వెళ్లే బ్యాగ్‌ నాసిరకంగా ఉండడంతో పంపిణీ చేసిన నెల రోజులకే చినిగిపోయాయి. వాటిని కుట్టించే ప్రయత్నాలు చేసినా పట్టుమని పదిరోజులు కూడా ఉండకపోవటంతో పుస్తకాలు పెట్టుకోవడానికి బ్యాగ్‌లు లేక విద్యార్థులు నిత్యం కంటతడి పెడుతున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పుస్తకాలు ఎక్కువగా ఉండడంతో బ్యాగ్‌లు బరువును ఆపలేక చినిగిపోయి అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు భారమైనప్పటికీ కొత్తబ్యాగ్‌లు కొనుగోలు చేయక తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులతో పోటీపడి రాణించాలి. ఇది జరగాలంటే కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులతో పోటీ పడేందుకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు కల్పించాలి. ఇది తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో విద్య ప్రాధాన్యతను గుర్తించిన గత ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా కానుక పేరుతో ప్రతి విద్యార్థికి పాఠశాల తెరిచిన రోజే కిట్‌లను పంపిణీ చేశారు. ఆ కిట్‌లో పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌, బూట్లు, సాక్సులు, టై, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీతోపాటు బ్యాగ్‌ ఉండేవి. వాటి నాణ్యతా ప్రమాణాలను స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించి పకడ్బందీగా పంపిణీ చేయించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులకు అనేక సమస్యలు, సవాళ్లు, సందేహాలు, ఒడుదొడుకుల నడుమ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. గత ప్రభుత్వం పంపిణీ చేసిన విద్యా కానుక కిట్ల పేరును.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌గా చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వం మాదిరిగా కిట్‌లను పాఠశాల తెరిచిన రోజే పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు, సోషల్‌ మీడియాలో ప్రచారాలు దంచి కొట్టారు. కానీ చివరకు పాఠశాలల పునః ప్రారంభం రోజు పంపిణీ చేయలేక మెగా పీటీఎం సమావేశాల్లో పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. అప్పటికీ విద్యార్థులకు సరిపడా కిట్‌లోని అన్ని రకాలు రాకపోవడంతో అరకొరగా వచ్చిన వాటిని పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. పంపిణీ చేసిన వాటిలో బ్యాగ్‌లు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. వీటిలో 85 శాతం పైగా బ్యాగ్‌లు చినిగిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,40,297 సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం సరఫరా అయ్యాయి. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని నాణ్యత ప్రమాణాలతో కూడిన స్కూల్‌బ్యాగ్‌లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

నేడు అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ...

నాడు నాణ్యత కలిగిన బ్యాగ్‌లు..

శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
పుస్తకాలు పెట్టుకునేందుకు విద్యార్థులకు తప్పని తీవ్ర కష్టాలు

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి

మిత్ర పేరుతో కిట్‌లు పంపిణీ

నాసిరకం కావడంతో నెల రోజులకే

చీకు పట్టి చినిగిపోయిన బ్యాగులు

జిల్లాలో పంపిణీ చేసిన కిట్లలో

85 శాతానికిపైగా చినిగిపోయినవే

పుస్తకాలు పెట్టుకునేందుకు నిత్యం

ఇబ్బందులు తప్పని విద్యార్థులు

తల్లిదండ్రులపై భారం పడుతున్నా

విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం

జిల్లాకు 1,40,297 కిట్‌లు సరఫరా

కొత్తవి పంపిణీ చేయాలని విద్యార్థుల

తల్లిదండ్రులు డిమాండ్‌

బాలల బ్యాగు పట్టని బాబు! 1
1/5

బాలల బ్యాగు పట్టని బాబు!

బాలల బ్యాగు పట్టని బాబు! 2
2/5

బాలల బ్యాగు పట్టని బాబు!

బాలల బ్యాగు పట్టని బాబు! 3
3/5

బాలల బ్యాగు పట్టని బాబు!

బాలల బ్యాగు పట్టని బాబు! 4
4/5

బాలల బ్యాగు పట్టని బాబు!

బాలల బ్యాగు పట్టని బాబు! 5
5/5

బాలల బ్యాగు పట్టని బాబు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement