రైతు నెత్తిన ఎరువు దరువు
● ఎమ్మార్పీ కంటే అధికంగా
వ్యాపారుల విక్రయం
● వ్యవసాయానికి భారీగా
పెరిగిన పెట్టుబడులు
● చంద్రబాబు ప్రభుత్వంలో
పెట్టుబడి సాయం అంతంత మాత్రమే
● ఏ పంటకూ గిట్టుబాటు ధర
లభించక తీవ్ర నష్టాలు
● జిల్లాలో 2,76,947 హెక్టార్లలో
వివిధ పంటల సాగు
సత్తెనపల్లి: చంద్రబాబు పాలనలో ఎరువుల, ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతుండడంతో రైతుల పై మోయలేని భారం పడుతోంది. పెట్టుబడి సాయం అంతంతమాత్రంగానే ఉండటం, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు పాలవుతున్నారు. గత ఏడాది సాగు చేసిన వరి, మిర్చి, పత్తి రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ఽపంట ఉత్పత్తులు ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడంతోపాటు బస్తాకు అదనంగా వ్యాపారులు దోచుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు ధర రాక నష్టాల బాట..
జిల్లా వ్యాప్తంగా 2,76,947 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతు న్నాయి. అందులో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది వరికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు నష్టాలు బాట పట్టారు. తీరా పంట చేతికి వచ్చేసరికి ధాన్యానికి ధరలు లేక దళారులకు తక్కువ ధరకే విక్రయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎకరా పంట సాగు చేయడానికి పంటను బట్టి రూ.35 వేల నుంచి రూ.80 వేల పైనే ఖర్చవుతోంది. ఈ ఏడాది ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు మరో రూ.15 వేలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట ఉత్పత్తుల ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ప్రధానంగా ఇటీవల కురిసిన మోంథా తుఫాన్‌తో పత్తి పంట తడిచి నల్లగా మారింది. దీంతో తేమశాతం పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.


