పల్నాడులో పోలీసుల ప్రత్యేక రాజ్యాంగం
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తమ పార్టీ నేత, వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు సుప్రీం కోర్టు ఆదేశాలతో కోర్టులో లొంగిపోతుండటంతో ఆయనను పరామర్శించేందుకు వెళుతున్న నాయకులను హోస్ అరెస్ట్‌లు చేయడం దారుణమని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పల్నాడు జిల్లాలో పోలీసులు ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, వైఎస్సార్‌పీపీ అధికారప్రతినిధి యాదవ్ మాట్లాడారు.
పిన్నెల్లి సోదరులకు సంఘీభావం
తెలిపేందుకు వెళ్లనివ్వకుండా
అడ్డుకోవడం దుర్మార్గం
చంద్రబాబుకు రాజకీయ లబ్ధి
చేకూర్చేలా పల్నాడు పోలీసు చర్యలు
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా
జిల్లాలో వైఎస్సార్‌సీపీపై ఆంక్షలు
ఓవరాక్షన్ చేసే పోలీసులపై
చర్యలు ఉంటాయి
అక్రమ కేసులు నమోదు చేసే
పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌లు
నమోదు చేస్తాం
వెఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్
ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి,
మాజీ మంత్రి విడదల రజిని,
మాజీ ఎమ్మెల్యే కాసు, పార్టీ రాష్ట్ర
అధికారప్రతినిధి నాగార్జున యాదవ్


