వైఎస్సార్‌ సీపీ నుంచి ఏరువ వెంకటేశ్వరరెడ్డి సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నుంచి ఏరువ వెంకటేశ్వరరెడ్డి సస్పెన్షన్‌

Dec 13 2025 7:46 AM | Updated on Dec 13 2025 7:46 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ నుంచి ఏరువ వెంకటేశ్వరరెడ్డి సస్పెన్షన్‌

వైఎస్సార్‌ సీపీ నుంచి ఏరువ వెంకటేశ్వరరెడ్డి సస్పెన్షన్‌ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శిగా కిషోర్‌బాబు పీహెచ్‌సీ సిబ్బందికి జీతాలు చెల్లింపు పోలియో చుక్కలకు ఏర్పాట్లు చేయండి నేడు ఏపీఎంఈఎఫ్‌ జిల్లా ప్రథమ మహాసభ

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన ఏరువ వెంకటేశ్వరరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేటనియోజకవర్గానికి చెందిన కొత్తూరి కిషోర్‌బాబును రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అచ్చంపేట: స్థానిక పీహెచ్‌సీలో పనిచేసే సిబ్బందికి అధికారులకు మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా గత మూడు నెలల జీత భత్యాలు రాని వైనంపై పీహెచ్‌సీకి ‘విభేదాల రోగం’ శీర్షికన ఈనెల 7న సాక్షి పల్నాడు జిల్లా పేజీలో ప్రచురితమైన వార్తకు ఉన్నతాధికారులు స్పందించారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు రావలసిన రెండు నెలలకు, కాంట్రాక్టు ఉద్యోగులకు రావలసిన మూడు నెలల బకాయిలను చెల్లించారు. సిబ్బందికి వెంటనే జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా అచ్చంపేట వైద్యాధికారి డాక్టర్‌ సీహెచ్‌ స్రవంతి తెలిపారు. ఇదిలా ఉండగా, బకాయిలో చెల్లింపులో జాప్యంపై ఆరాతీస్తే నిజాలు బయటకు వస్తున్నాయి. గత ఏడాదిన్నరగా పీహెచ్‌సీలో పనిచేసే యూడీసీ తరచూ విధులకు గైర్హాజరవుతూ గోరంట్ల నుంచి బయోమెట్రిక్‌ విధానం ద్వారా హాజరు వేసుకుంటున్న నిజం బయటపడింది. ప్రస్తుతం పీహెచ్‌సీలో పనిచేసే యూడీసీ గతంలో పనిచేసిన యూడీసీ రషీద్‌ చేత బిల్లులు వేయిస్తారని, ఆ యూడీసీ గుంటూరు జిల్లా మేడికొండూరుకు బదిలీ అయి అక్కడ నుంచే గత ఏడాదిన్నరగా అచ్చంపేట పీహెచ్‌సీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మొత్తం నడుపుతున్నారన్న అంశం బయటకు వచ్చింది. ఇప్పుడు గత యూడీసీ ఇకపై తాను బిల్లులు వేయడం కుదరదని చెప్పడంతో ఈ యూడీసీ నిర్వహించాల్సిన విధులు కొన్ని నిలిచిపోగా మరికొన్ని అందుకు సంబంధించిన ఉద్యోగులే చేసుకుంటున్నారు.

జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో డీఆర్‌ఓ

నరసరావుపేట: జిల్లాలో సున్నా నుంచి ఐదేళ్ల వయస్సు పిల్లలు అందరికీ తప్పనిసరిగా పోలియా చుక్కలు అందజేయాలని, ఒక్క చిన్నారిని కూడా వదలకుండా ఇంటింటి పర్యటనలు, హైరిస్క్‌ ప్లాన్‌లు అమలు చేయాలని డీఆర్‌ఓ ఏకా మురళీ ఆదేశించారు. ఈ నెల 21న నిర్వహించే నేషనల్‌ ఇమ్యునైజేషన్‌ డై సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. హాజరైన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌బి.రవి. డీఐఓ డాక్టర్‌ వై.రాంబాబు, ఇతర అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలియో బూత్‌ల ఏర్పాటు వంటి అంశాలు పరిశీలించారు. వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలు, బస్‌స్టాండ్లు రైల్వేస్టేషన్లు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని కోరారు.

మాచర్ల: ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఏపీఎంఈఎఫ్‌) పల్నాడు జిల్లా ప్రథమ మహాసభ పట్టణంలోని మానుకొండ కల్యాణ మండపంలో శనివారం నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేపల్లి అబ్రహం లింకన్‌, మాచర్ల ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు చెరుకూరి గోపాల్‌, కొమ్ము నాగరాజు, మక్కెన సీతయ్యలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా అబ్కాస్‌ ఉద్యోగులుగా పనిచేస్తూ రెగ్యులర్‌ కాకపోగా ప్రభుత్వ విధానాలు మారినప్పుడల్లా అన్నీ విభాగాలు తొలగిస్తూ రోడ్డున పడవేయటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ, పీఆర్సీ, ఎన్‌క్యాష్‌మెంట్‌ లీవ్‌లతోపాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తాము నాన్‌ పిహెచ్‌సి ఉద్యోగులుగా తాగునీరు, రోడ్లు, కాల్వల నిర్మాణం, అనేక గంటలు పనిచేస్తూ, పండుగ సెలవులు లేకుండా ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీటన్నింటిని పరిష్కరించేందుకు మున్సిపల్‌ ఉద్యోగులు అన్నీ విభాగాలను సంఘటితం చేసి మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో రాష్ట్ర కార్యదర్శి బందెల రవికుమార్‌, ఈదులమూడి రవిబాబు, సోమిశంకరరావు, కునపాముల విఘ్నేష్‌, రేలంగి నాగరాజుతోపాటు పలువురు పాల్గొంటారన్నారు.

వైఎస్సార్‌ సీపీ నుంచి ఏరువ వెంకటేశ్వరరెడ్డి సస్పెన్షన్‌1
1/1

వైఎస్సార్‌ సీపీ నుంచి ఏరువ వెంకటేశ్వరరెడ్డి సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement