దావుపల్లి సర్పంచిపై టీడీపీ కార్యకర్తల దాడి
హనుమంతు నాయక్‌కు తీవ్ర గాయాలు
వెల్దుర్తి: మండలంలోని దావుపల్లి తండా సర్పంచి రమావత్ హనుమంతు నాయక్ పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, గొడ్డళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన ఆర్మీలో పనిచేస్తున్న దేస్‌వత్ భీక్యానాయక్, సర్పంచి హనుమంత్ నాయక్‌కు ఇంటి వద్ద ఉన్న స్థలం విషయంలో సోమవారం పంచాయితీ జరిగింది. అది మనసులో పెట్టుకున్న భీక్యానాయక్ వేరే గ్రామాల నుంచి కిరాయి వారిని తీసుకొచ్చి మంగళవారం ఉదయం పొలానికి వెళ్లిన హనుమంతు నాయక్‌పై భీక్యానాయక్‌తో పాటు మరో ఐదుగురు కారులో పొలం వద్దకు వచ్చి రాళ్ళు, గొడ్డళ్ళతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. భయపడిన హనుమంతునాయక్ వెల్దుర్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి, మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో చేరాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు రిఫర్ చేశారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.


