భయపెడుతున్న మోంథా తుఫాన్
నరసరావుపేటలో కూలిన విద్యుత్ స్తంభం వినుకొండరోడ్డులో రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లు కొనసాగుతున్న వర్షం, గాలులు
నరసరావుపేట: జిల్లాలో తుఫాన్ వర్షం సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగుతుంది. తెరలు తెరలుగా తేలిక పాటి వర్షాలు, గాలులు వీస్తున్నాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో తుఫాన్ ప్రభావం కారణంగా పల్నాడురోడ్డులో పాత బస్టాండ్ సెంటర్‌లో ఎన్‌టీఆర్ విగ్రహంకు వెనుకపైపున సెంట్రల్ డివైడర్‌లో ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభం సాయంత్రం 4.30గంటల సమయంలో కూలి రోడ్డుపై పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవటంతో ఎవరికీ గాయాలు కాలేదు. అలాగే వినుకొండ రోడ్డులో మూడు చెట్లు కూలి రోడ్డుపై పడగా వెంటనే పొక్లెయిన్‌తో వాటిని తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు తెలపారు. జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 వరకు 357.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అక్కడి నుంచి 12.00 గంటల వరకు 129.2 మి.మీ,, అక్కడి నుంచి 2గంటలవరకు 33.8 మి.మీ., అక్కడి నుంచి నాలుగు గంటలవరకు 44.6 మి.మీ., అక్కడి నుంచి 6 గంటల వరకు 88.6 మి.మీ., వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో బోటింగ్, చేపల వేట నిషేధం
నరసరావుపేట: జిల్లాలో బోటింగ్, చేపల వేట బుధవారం వరకు నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాగార్జునసాగర్‌లో బోటింగ్ సర్వీసు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిలిచిపోనున్నాయి.


