జాతీయ పోటీలకు క్రీడాకారులు ఎంపిక
కందుకూరు రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కడప జిల్లాలో జరిగిన అండర్–19 బాల, బాలికల రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో క్రీడాకారుల పలు పతకాలు సాధించారు. వచ్చే నెలలో జమ్మూకశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తైక్వాండో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, జిల్లా కార్యదర్శి ఎస్‌కే అబ్దుల్ సలామ్ తెలిపారు. బాలికల విభాగంలో బి.లక్ష్మీ అక్షర (కందుకూరు), పి.మేరీ స్టెల్లా (చీరాల), బాలుర విభాగంలో ఎం.కల్వరిగిరి (చీరాల), ఓ.సువార్త (చీరాల)లు ఎంపికై న వారిలో ఉన్నారన్నారు. అదే విధంగా జి.దేవకుమార్ (చీరాల) కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. క్రీడాకారులను కోచ్ పి.ప్రశాంత్‌బాబు, జిల్లా అధ్యక్షుడు వీరస్వామి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ సలాఉద్దీన్ తదితరులు అభినందించారు.


