జిల్లా పుట్‌బాల్ జట్లు ఎంపిక
నరసరావుపేట రూరల్: ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 బాలబాలికల పుట్‌బాల్ జట్లు ఎంపిక పోటీలు శనివారం కోటప్పకొండ త్రికోటేశ్వర జెడ్పీ హైస్కూలులో నిర్వహించారు. 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, అనుమోలు వెంకయ్య చౌదరి, పోతార్లంక రవి ప్రారంభించారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్‌కుమార్, గేమ్ ఇన్‌చార్జ్ చిరంజీవిరావు, వ్యాయామ ఉపాధ్యాయులు కరీముల్లా, సునీత, గౌసియా, షరీఫ్, గంగాధర్, శరత్, అనిల్, వెంకటేశ్వర్లు, కోటేశ్వరి, యల్లమంద, చినరామయ్య, అలి పాల్గొన్నారు. అండర్–14 జట్టుకు ఎంపికై న క్రీడాకారులు మదనపల్లెలో, అండర్–17 జట్లు నరనసరావుపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని సరేష్‌కుమార్ తెలిపారు.
జిల్లా పుట్‌బాల్ జట్లు ఎంపిక


