జాతీయ డాడ్జిబాల్ పోటీలకు ఎస్‌ఎస్ అండ్ ఎన్ విద్యార్థ
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి డాడ్జిబాల్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థి ఎల్.యుగంధర్ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చిలుమూరులో నిర్వహించిన 10 ఏపీ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల పోటీలలో పల్నాడు జిల్లా తరపున పాల్గొన్న తమ విద్యార్థి యుగంధర్ ప్రతిభ కనపరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్టు వివరించారు. గుజరాత్‌లో నవంబర్ 14 నుంచి 17వ తేది వరకు జరగనున్న 10వ సబ్ జూనియర్ నేషనల్ డాడ్జిబాల్ చాంపియన్‌షిప్– 2025 పోటీల్లో యుగంధర్ ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. యుగంధర్‌ను కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్, వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి తదితరులు అభినందించారు.


