మిత్రపక్షాలు పొత్తు ధర్మాన్ని పాటించాలి
సత్తెనపల్లి: పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎక్కడా ధిక్కరించకుండా సహకరించారని, మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని హోటల్ కార్తికేయలో శనివారం నిర్వహించిన జనసేన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందంటే జనసేన పాత్ర ప్రాముఖ్యమైనదని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో జనసేన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.
జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు


