
పేద రోగులు విలవిల
న్యూస్‌రీల్
రెండు వారాలుగా నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవ 26 రోజులుగా సమ్మెలో పీహెచ్‌సీ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు తప్పని తీవ్ర అవస్థలు కనీసం స్పందించని కూటమి ప్రభుత్వం అరకొర వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టుల సేవలే దిక్కు
క్షేత్రస్థ్ధాయి పరిశీలనలో...
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
సాగర్ నీటిమట్టం
పల్నాడు
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఇటు వైద్యుల సమ్మె, అటు ఎన్టీఆర్ వైద్యసేవ బంద్‌తో కష్టాలు
సత్తెనపల్లి: వైద్యులు, ఆస్పత్రుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం పేద రోగులకు శాపంగా మారింది. జిల్లాలో గ్రామీణ ప్రాంత రోగులకు ప్రభుత్వ వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్యులు గత నెల 26వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. వైద్య సేవల కోసం చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ వైద్య సేవ నిలిచిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 110 మంది వైద్యులు పనిచేస్తున్నారు. చాలా మంది డిమాండ్ల పరిష్కారం కోరుతూ గత నెల 26 నుంచి వివిధ రూపాల్లో నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగి రాకపోవడంతో గత నెలాఖరునుంచి ఓపీ, అత్యవసర సేవలను సైతం నిలిపివేసి సమ్మెలోకి వెళ్లిపోయారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై పలువుర్ని పంపించినా చాలామంది వేరువేరు స్పెషలిస్టులు కావడంతో మొక్కుబడిగా ఇలా వచ్చి అలా చూసి వెళ్లిపోతున్నారని రోగులు చెబుతున్నారు. ఫలితంగా రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు.
జిల్లాలో ప్రతిరోజు ఎంపిక చేసిన గ్రామంలో 104 ద్వారా సేవలు అందించాలి. పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పుడు ఒక వైద్యుడు 104 ద్వారా గ్రామానికి వెళ్లి సేవలందించేవారు. సమ్మెతో 104 వాహనాల్లో వైద్యుడు వెళ్లడం లేదు. వైద్యులు లేకుండా మందులు ఇవ్వకూడదనే నిబంధనతో ప్రస్తుతం సిబ్బంది కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇంత దిగజారినా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల వైద్యులు మండిపడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు ఇచ్చే మందులతోనే సరి పెట్టుకుంటూ రోగులు అవస్థలు పడుతున్నారు.
7
సత్తెనపల్లి నియోజకవర్గంలో 6 పీహెచ్‌సీలు ఉంటే 12 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. మిగిలిన ఆరుగురిలో డాక్టర్ సాయితేజారెడ్డి (సత్తెనపల్లి)ని అచ్చంపేటకు, డాక్టర్ వెంకటేశ్వర్లు (కుంకలగుంట)ని కారంపూడి పీహెచ్‌సీకి పంపారు. డాక్టర్ రవితేజా నాయక్ (రాజుపాలెం) సెలవులో ఉన్నారు. పణిదంలో డాక్టర్ శివలీల, ముప్పాళ్ళలో డాక్టర్ రమాదేవి, కుంకలగుంటలో డాక్టర్ పూజాశ్రీ , సత్తెనపల్లి అర్బన్ పీహెచ్‌సీ నుంచి డాక్టర్ ధర్మసింగ్‌శాస్త్రి రాజుపాలెం పీహెచ్‌సీలో, నరసరావుపేట పీపీ యూనిట్ నుంచి డాక్టర్ రత్నకుమార్ నకరికల్లు పీహెచ్‌సీలో సేవలు అందిస్తున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు
ఎగువ నుంచి 24,320 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 37,709 క్యూసెక్కులు అధికారులు వదులుతున్నారు.
దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి బుధవారం పశ్చిమ డెల్టాకు 4,012 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 587.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 52,560 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ఓ వైపు ఎన్టీఆర్ వైద్యసేవ కింద ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు వైద్యం అందించడం లేదు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు సమ్మెకు దిగారు. దీంతో పేద, మధ్య తరగతి గ్రామీణ ప్రజలకు వైద్యం అందక విలవిల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూటమి పాలకులు చోద్యం చూస్తున్నారు. ప్రజల ప్రాణాలకు విలువే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

పేద రోగులు విలవిల

పేద రోగులు విలవిల

పేద రోగులు విలవిల

పేద రోగులు విలవిల

పేద రోగులు విలవిల

పేద రోగులు విలవిల

పేద రోగులు విలవిల