
నిధుల వినియోగంలో సమతుల్యత ముఖ్యం
నరసరావుపేట: ఉపాధి హామీ నిధుల వినియోగంలో అన్ని నియోజకవర్గాల మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం డ్వామా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రగతి నివేదికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పూర్తిగా వినియోగించాలన్నారు. ఇప్పటికే మంజూరైన పనులను గ్రౌండింగ్ చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 103 చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
ప్రజల సంతృప్తిని తెలుసుకుంటున్నాం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని అడిగి తెలుసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మికి ఈ మేరకు చెప్పారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం పీజీఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం, పేదలకు ఇళ్ల స్థల పట్టాల పంపిణీ, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, జిల్లాల విభజన తదితర అంశాలపై చీఫ్ కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ జయలక్ష్మి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పాల్గొన్నారు.
అధికారులకు జిల్లా
కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశం