
అధికారులు స్పందించ లేదు
రెండు నెలల కిందట నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులకు తగ్గింది. తరువాత శరీరంపై గడ్డ వచ్చింది. వెంటనే గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి డ్రస్సింగ్, ఆరు నెలల పాటు పరిశీలనలో ఉండాలని చెప్పారు. గతంలో మా గ్రామానికి బోరు పని చేయకపోవడంతో క్వారీ గుంత నుంచి అందించారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రతి రెండు రోజలకు ఒక సంఘటన జరుగుతూనే ఉంది. నాకు చికిత్సలకే రూ. 5 లక్షలు ఖర్చయింది.
– మెట్టు నాగిరెడ్డి, గ్రామస్తుడు