
ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం
నరసరావుపేట: ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం వినుకొండరోడ్డులోని రోటరీక్లబ్ భవనంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు జమ్ముల రాధాకృష్ణ ఏపీ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకొని అభినందనసభ, జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా కేవీ, కార్యదర్శిగా కసుకుర్తి రాజశేఖర్, కోశాధికారిగా రాంబాబు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లకు చెందిన జిల్లా సభ్యులతో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నరసరావుపేట ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మన్నేపల్లి శ్రీనివాసరావు, పడవల వంశీకృష్ణ, కోశాధికారి చిన్ని వెంకటేష్‌ల ఆధ్వర్యంలో జమ్ముల రాధాకృష్ణను సన్మానించారు. ప్రింటింగ్ రంగంలో రాబోతున్న మార్పులు, అడ్వాన్స్ మిషనర్, క్లస్టర్స్, ఇతర విషయాలపై చర్చించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికి ధన్యవాదాలు తెలియచేశారు.