
పల్నాడు
న్యూస్‌రీల్
ఇబ్బందుల్లేకుండా చర్యలు
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జె.పంగులూరు: మండల పరిధి కొండమంజులూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు 365 సైకిళ్లను శనివారం ఉచితంగా అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 74,106 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 82,090 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.
ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అది... ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న ప్రాంతమది.. కానీ రాకపోకలకు ప్రయాణికులు కనీస సౌకర్యాలు కూడా లేక కష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. అమరావతిలో ఎక్కడా బస్ షెలర్లు లేకపోవటంతోపాటుగా ఊరి చివర ఉన్న బస్టాండ్ నిర్వహణలో నిర్లక్ష్యమే వారికి శాపంగా మారింది. ఏడాదిగా వారు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు.
గతంలో బస్టాండు స్థలంలో చెట్లు ఏడాదికొకసారి కొట్టించేవారు. ప్రస్తుతం అలా కొట్టకపోవటంతో అడవిలాగాకంపచెట్లు బాగా పెరిగాయి. మురుగు నీటి నిల్వతో విషసర్పాలు సమీపంలో ఉన్న ఇళ్లలోకి రావటం పరిపాటిగా మారింది. రోజుల తరబడి తీవ్ర దుర్వాసన వస్తోంది. దోమలు పెరిగాయి. స్థానికులు రోగాల పాలవుతున్నారు.
– నక్కా వెంకట నాగరత్నం,
అమరావతి
అమరావతి: అమరావతికి దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు నిత్యం వస్తుంటారు. ముందు చూపుతో సుమారు 50 ఏళ్ల క్రితం అమరావతి బస్టాండుకు సుమారు ఆరు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. గుంటూరు నుంచి క్రోసూరు, అచ్చంపేట మండల కేంద్రాలు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మధ్యలో ఉన్న అమరావతి ఆర్టీసీ డిపో నిర్మాణానికి అనువుగా ఉంటుందని సర్కారు ఈ స్థలం ఇచ్చింది. ఇప్పటి వరకు అందులో కొద్ది స్థలంలో మాత్రమే బస్టాండ్ నిర్మించారు. మిగిలిన స్థలం నిరుపయోగంగా కంప చెట్లతో అడవిని తలపిస్తోంది. వాన పడితే నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోంది. ప్రయాణికులతోపాటు పక్కన కాలనీ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో తాగుబోతులు పెరిగారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు కంట్రోలర్లు ఉన్నారు. ప్రయాణికులకు బస్సుల సమయాలను చెబుతూ, బస్టాండు నిర్వహణను ఒకరు చూస్తున్నారు. మరొకరు దుర్గావిలాస్ సెంటర్‌లో ఉంటూ విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి బస్సులను క్రమపద్ధతిలో పెట్టించి ప్రయాణికులను పంపుతూ ఆక్యుపెన్సీ రేటు పెంచే పనులు చేస్తున్నారు.
బస్టాండ్‌లో అధ్వానంగా వసతులు
బస్టాండ్‌లో చీకటైతే విద్యుద్దీపాలు తక్కువగా ఉండటంతో రోడ్డుపైకి వచ్చి ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ఆరు ఫ్యాన్లకుగాను సగం పనిచేయడం లేదు. రాత్రివేళ విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి డిపోల బస్ సర్వీసుల డ్రైవర్లు, కండక్టర్లు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఆ గది గోడలు పగుళ్లిచ్చాయి. ఇనుప మంచాలు తుప్పుపట్టి, పరుపులు చిరిగిపోయి ఉన్నాయి. ప్రయాణికులకు తాగునీరు అందించడానికి ఒక్క పంపు మాత్రమే ఉంది. మిగిలినవి పని చేయటం లేదు. వానజల్లు పడితే చాలు బస్టాండులోని ప్రయాణికులు తడిసిపోవాల్సిందే. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం లోపించింది. ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిత్యం సుమారు 4 వేల మందికిపైగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. మండల కేంద్రమైన అమరావతిలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు షెల్టర్ కూడా లేదు. అమరేశ్వర ఆలయం నుంచి ఊరి చివర బస్టాండు వరకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నాలుగు సెంటర్‌లలో బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. గతంలో అమరేశ్వరాలయం వద్ద ఉన్న బస్‌షెల్టర్ కాలక్రమంలో పోలీస్ ఔట్‌పోస్టుగా మారింది. మద్దూరు డౌన్ సెంటర్‌లోని బస్ షెల్టర్ తొలగించారు.
అమరావతి పర్యాటక, శైవక్షేత్రంగా పేరుగాంచింది. నిత్యం వేల సంఖ్యలో వచ్చే వారికి బస్టాండులో కనీస సౌకర్యాలు లేవు. అధికారులు లేక కొన్ని బస్సుల వారు సమయపాలన పాటించడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి కనీస వసతులు కల్పించడానికి ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– దారాప్రసాద్,
అమరావతి మండల వైఎస్సార్‌సీపీ కార్యదర్శి
అమరావతి సెంటర్‌లో బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్న ప్రయాణికులు
కంపచెట్లు పెరగడం వలన మరుగుగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ స్థలం అడ్డాగా మారింది. మద్యం తాగే వారికి అనువుగా ఉంది. పక్కన ఉన్న రోడ్డులో స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నడవాలంటే మందుబాబులకు భయపడాల్సిన దుస్థితి. బస్టాండ్‌లో తగిన వసతులు కల్పించి, పారిశుద్ధ్యం మెరుగుపరచాలి.
– బి.సూరిబాబు,
అమరావతి మండల సీపీఎం కార్యదర్శి
చిట్టడవిని తలపిస్తున్న ప్రాంగణంలోని పిచ్చి చెట్లు
పనిచేయని తాగునీటి కొళాయిలు
అమరావతి బస్టాండు
7
బస్టాండ్ ఆవరణలో చెట్లు కొట్టించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. కంట్రోలర్ నియామకానికి ప్రతిపాదనలు పంపాం. మరుగుదొడ్లు, తాగునీటి కొళాయిలు, ఫ్యాన్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని కొద్దిరోజులలో సరి చేయిస్తాం. బస్టాండు స్థల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. మిగిలిన సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటాం.
– విజయకుమార్,
ఆర్టీసీ డిపో మేనేజర్, సత్తెనపల్లి

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు