
29న జెడ్పీ సర్వసభ్య సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచారం పంపారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో అజెండాలో పొందుపర్చిన అంశాలతోపాటు వివిధ శాఖల ప్రగతిపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గుంటూరు డివిజన్ సహకారశాఖ అధికారి సేనారెడ్డి ఆదేశం
కొరిటెపాడు(గుంటూరు): ‘సహకారంలో జీతాల కుంభకోణం’ శీర్షికన ఈ నెల 10వ తేదీన సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనంపై సహకార శాఖ డివిజనల్ అధికారి సేనారెడ్డి స్పందించారు. వివరణాత్మక నివేదిక సమర్పించాలని మండల ఇన్‌చార్జులను ఆదేశించారు. గుంటూరు డివిజన్‌లోని మండలాల్లో ఉన్న పీఏసీఎస్‌లకు కేటాయించిన మండల ఇన్‌చార్జులు సోమవారం సాయంత్రం 5 గంటలకు సహకార శాఖ డివిజన్ కార్యాలయానికి ఆధారాలతో వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. అలాగే సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ కూడా ఆరా తీసినట్లు సమాచారం.
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలులోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా వాంతులు, విరేచనాలు, జ్వరాల కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చేబ్రోలులోని చెరువులోపాలెంలో శనివారం ఐదుగురికి డయేరియా లక్షణాలు కనిపించటంతో వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నారు. రెండు రోజులుగా వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు జ్వరాలబారిన పడ్డారు. ప్రభుత్వ వైద్యశాలలతోపాటు స్థానిక ఆర్‌ఎంపీలు, గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలల్లో కూడా వారు చికిత్స పొందుతున్నారు. చెరువులోపాలెంలో ఆహార కలుషితం కారణంగానే వాంతులు, విరేచనాలు బారిన పలువురు పడినట్లు పీహెచ్‌సీ అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు.
తాడికొండ: అమరావతిలో నిర్మించిన ఏపీ సీఆర్డీ ఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ శనివారం సందర్శించారు. ప్రాజెక్టు కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ీసీఆర్డీ ఏ కమిషనర్ కన్నబాబు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో సీఆర్డీ ఏ అడిషనల్ కమిషనర్ ఎ. భార్గవ్ తేజ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

29న జెడ్పీ సర్వసభ్య సమావేశం

29న జెడ్పీ సర్వసభ్య సమావేశం