
స్వయం సహాయక సంఘాలకు రూ.5.07 కోట్లు కేటాయింపు
నరసరావుపేట రూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో పల్నాడు జిల్లాకు రూ.5.07 కోట్లు కమ్యూనిటీ ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్ కేటాయించారని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి పేర్కొన్నారు. శుక్రవారం కోటప్పకొండ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం గ్రామనిధి అనే పోర్టల్ ప్రారంభించిందని, దీని ద్వారా జిల్లాలోని 26 మండలాలకు మండలానికి రూ.19.50 లక్షల చొప్పున మంజూరు చేశారన్నారు. గ్రామ సంఘాలలోని స్వయం సహాయక సంఘాల వారు అవసరం మేరకు దానిని గ్రామనిధి పోర్టల్‌లో అప్‌లోడు చేసుకోవాలని తెలియజేశారు. జిల్లా సమాఖ్య ప్రతినిధులు అందరూ కలిసి స్వయం సహాయక సంఘాలకు గ్రామ సంఘం అసిస్టెంట్‌లుగా మహిళలు మాత్రమే కొనసాగాలని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సంఘం అసిస్టెంట్‌గా మహిళలు ఉంటే ఏవిధమైన సమాచారమైన చెప్పకోవటానికి అభ్యంతరాలు ఉండవని జిల్లా సమాఖ్య ప్రతినిధులు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి తెలియచేశారు. ఏపీడీ రాజా ప్రతాప్, డీపీఎంలు మల్లీశ్వరి, శ్రీనివాస్, డేవిడ్ పాల్గొన్నారు.