
వృద్ధురాలి మృతదేహానికి రీపోస్టుమార్టం
క్రోసూరు: నెల రోజుల కిందట మృతి చెందిన వృద్ధురాలు చిలకా ఆరోగ్యమ్మ(96) మృతదేహానికి శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ వి.వి.నాగరాజు తెలిపిన వివరాల మేరకు మృతురాలు నరసరావుపేటలో నివసిస్తూ అక్కడే నెల కిందట మృతి చెందింది. అయితే ఆమెను క్రోసూరు క్రైస్తవ సమాధుల్లో పూడ్చిపెట్టటం జరిగింది. ఆమె భర్త చాలా కాలం కిందట మృతి చెందాడు. ఆమె మృతి పట్ల అనుమానం వ్యక్తపరుస్తూ ఆమె కోడలు రూతమ్మ నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి ఎస్‌ఐ సీహెచ్ కిషోర్ రీ పోస్టుమార్టంకు ఏర్పాటు చేయగా తహసీల్దార్ పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో బ్రహ్మనాయుడు, సిబ్బంది, మృతురాలి బంధువులు పాల్గొన్నారు.