
రాష్ట్ర స్థాయి పోటీలకు కారంచేడు విద్యార్థులు
కారంచేడు: త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కారంచేడు విద్యార్థులు ఎంపికయ్యారు. ఒంగోలులో ఈ నెల 7న నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలకు కారంచేడు యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 60 కేజీల బాలికల విభాగంలో భవ్యశ్రీ , బాలుర విభాగంలో బి. సుదీప్‌కుమార్ ఎంపికయ్యారు. 55 కేజీల విభాగంలో కె. దుర్గ ఎంపికై నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులను శుక్రవారం చీరాల డిప్యూటీ ఈఓ కె. గంగాధర్ అభినందించారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి గ్రామానికి, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పాఠశాల పీడీ షేక్ మస్తాని, ప్రధానోపాధ్యాయురాలు ఎం. సామ్రాజ్యాన్ని అభినందించారు.