కోటి సంతకాల ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

కోటి సంతకాల ఉద్యమం

Oct 11 2025 6:02 AM | Updated on Oct 11 2025 6:02 AM

కోటి

కోటి సంతకాల ఉద్యమం

మాచర్ల: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద రోగులు, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్‌ కళాశాలలను వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొస్తే అందులో 10 కళాశాలలు అమ్ముకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. జగన్‌ పిలుపు మేరకు శనివారం నుంచి నవంబర్‌ 24వ తేదీ వరకు దశల వారీగా వివిధ కార్యక్రమాలు చేపడతామని, కోటి సంతకాలు సేకరించనున్నామని తెలిపారు. శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్లను పీఆర్కే పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్‌ 11 నుంచి నవంబర్‌ 22 వరకు రచ్చబండ, సంతకాల సేకరణ జరుగుతుందన్నారు. నవంబర్‌ 12న జిల్లా కేంద్రాలలో ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులతో కలిసి భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. నవంబర్‌ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలు అందజేయటం జరుగుతుందన్నారు. వాటిని గవర్నర్‌కు జగన్‌మోహన్‌రెడ్డి అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతురెడ్డి కోటిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అబ్దుల్‌ జలీల్‌, పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, రాష్ట్ర, జిల్లా యువజన నాయకులు డి శ్రీనివాసరెడ్డి, నవులూరి చెన్నారెడ్డి, జిల్లా మహిళా విభాగం నాయకురాలు అనంతరావమ్మ, జిల్లా బిసి యువజన విభాగం నాయకులు పిల్లి కొండలు, జెడ్పీటీసీ పెద్ద మల్లుస్వామి, ఓరుగంటి చిన్నా, దేవళ్ల సాంబశివరావు, కొత్తపల్లి పున్నారెడ్డి, కౌన్సిలర్‌ మందా సంతోష్‌, దేవళ్ల సాంబశివరావు, పిన్నెల్లి హనిమిరెడ్డి, కందుకూరి మధు, యేరువ ప్రతాపరెడ్డి, తాళ్లపల్లి ఈశ్వరయ్య, వెంకట్రామయ్య, మోరా రామకృష్ణారెడ్డి, బొంగురు, అగ్గి రాముడు, కంభంపాటి అమర్‌, మద్దికర శ్రీనివాసరెడ్డి, చల్లా కాశయ్య, చల్లా మోహన్‌, దేవళ్ల యోగయ్య, గుంజ నాగ అంజి, ధనలక్ష్మి, తిరుమలకొండ దుర్గారావు, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సత్తెనపల్లిలో....

సత్తెనపల్లి: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి పాల్గొని వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, అచ్యుత శివప్రసాదు, మౌలాలి, రాయపాటి పురుషోత్తం, ఇందూరి నరసింహారెడ్డి, సతీష్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సత్తెనపల్లిలో పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సమన్వయకర్త గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, పార్టీ నాయకులు

పార్టీ కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ గోపిరెడ్డి, నాయకులు

నరసరావుపేట:ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేసే యోచనపై పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవా రం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను నా యకులు, కార్యకర్తలతో కలసి ఆవిష్కరించారు. డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ లో నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాలు చేయాల్సిన అవసరం ఉందన్నా రు. డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారు లు, రైతులు, విద్యార్థులు, యువజనుల ను భాగస్వామ్యం చేయాలన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జయప్ర దం చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఇంటలెక్చ్యువల్‌ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, సంయుక్త కార్యదర్శులు పాలపర్తి వెంకటేశ్వరావు, కనకా పుల్లారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా కార్యదర్శి ఎస్‌.సుజాతాపాల్‌, డ్వాక్రా విభాగ జిల్లా కార్యదర్శి హెల్డా ప్లోరెన్స్‌, పట్టణ అధ్యక్షులు షేక్‌ కరిముల్లా, న్యాయవాదులు వై.సీతారామిరెడ్డి, బ్లెసీనా, జీనేపల్లి హనుమంతరావు, విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి ఉప్పతోళ్ల వేణుమాధవ్‌, జిల్లా ఎస్సీ విభాగం కార్యదర్శి కందుల ఎజ్రా, పట్టణ వర్కింగ్‌ అధ్యక్షులు నిడమానూరి సురేంద్ర, అచ్చి శివకోటి, జిల్లా కోశాధికారి అన్నా మోహన్‌, మున్సిపల్‌ విభాగ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రెహమాన్‌, పట్టణ మైనార్టీసెల్‌ అధ్యక్షుడు షేక్‌ సిలార్‌బాషా, ఎస్సీ విభాగం పట్టణ కార్యదర్శి పౌలయ్య, పచ్చవ రవీంద్రబాబు, ఖాదర్‌బాషా, ఫణీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోటి సంతకాల ఉద్యమం1
1/1

కోటి సంతకాల ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement