
● మాజీ మంత్రి విడదల రజిని ● కోటి సంతకాల పోస్టర్ ఆవిష
చిలకలూరిపేట:రచ్చబండ ద్వారా ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విడదల రజిని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాసంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమ కార్యక్రమం పోస్టర్ ను పార్టీ నాయకులతో కలసి శుక్రవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని కోరుతూ వైఎస్సా ర్ సీపీ 45 రోజులపాటు గ్రామ స్థాయి వరకు ప్రజా ఉద్యమం ప్రారంభించిందని తెలిపారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ వైద్యకళాశాలల నిర్మాణం చేపట్టారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య దూరం చేసేలా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలా ల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహారావు, మంగు ఏడుకొండలు, పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఏకాబరపు సునీత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.