పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదుల వెల్లువ

Oct 7 2025 3:41 AM | Updated on Oct 7 2025 3:41 AM

పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదుల వెల్లువ

పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదుల వెల్లువ

నరసరావుపేట రూరల్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలతో పాటు మోసం తదితర సమస్యలపై 122 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, అదనపు ఎస్పీ( అడ్మిన్‌) జేవి సంతోష్‌. అదనపు ఎస్పీ(క్రైమ్‌) లక్ష్మీపతిలు పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.

స్థలాన్ని ఆక్రమించి గుడి కట్టారు..

తన స్ధలాన్ని ఆక్రమించి నిదానంపాటి మహాలక్ష్మీ అమ్మవారి గుడి నిర్మించారని చిలకలూరిపేటకు చెందిన ఝాన్సీరాణి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పురుషోత్తమపట్టణం చాకలికాలనీలో ఆరు సెంట్ల స్థలం 1984లో కొనుగోలు చేసినట్టు ఝాన్సీరాణి తెలిపారు. కరోనా సమయంలో తన భర్త చనిపోయాడని, రెండు నెలల క్రితం ఆ స్థలం వద్దకు వెళ్లి చూడగా బాణావత్‌ కోటేశ్వరరావు నాయక్‌ అనే వ్యక్తి గుడిని నిర్మించి బోర్డును పెట్టారని తెలిపింది. దీనిపై కోటేశ్వరనాయక్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా కులదూషణ కేసు పెడతామని బెదరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం..

బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.60లక్షలు మోసానికి పాల్పడినట్టు సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన బాధితుడు బాదరబోయిన తిరుపతిరావు పిర్యాదు చేసాడు. చిత్తూరుకు చెందిన బి.రమేష్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో రెండు ఖాతాల ద్వారా రూ.6.60లక్షలను చెల్లించినట్టు తెలిపాడు. ఉద్యోగం గురించి అడిగితే కాలయాపన చేయడంతో డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినట్టు తెలిపాడు. యాక్సిస్‌ బ్యాంక్‌ చెక్కులు ఇచ్చిన రమేష్‌ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసాడని ఫిర్యాదులు పేర్కొన్నాడు. న్యాయం చేసి నగదు ఇప్పించాలని కోరాడు.

నమ్మించి మోసం చేసాడు..

పరిచయం ఉన్న వ్యక్తి తనను నమ్మించి మోసం చేసినట్టు రొంపిచర్ల మండలం పరగటిచర్లకు చెందిన తిమ్మనపల్లి శివశంకర్‌ ఫిర్యాదు చేసాడు. నరసరావుపేటలోని బరంపేటకు చెందిన సిరంగి రవికాంత్‌తో కొంతకాలంగా పరిచయం ఉందని, తనకు సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉందని తన పేరుతో ఈఎంఐ రూపంలో బజాజ్‌ ఫైన్సాన్స్‌లో ఫోన్‌ తీసుకుంటానని చెప్పినట్టు తెలిపాడు. మొదట రూ.15వేలు ఫోన్‌ తీసుకుంటానని చెప్పి, మొబైల్‌ షాప్‌లో రూ.లక్ష విలువైన ఐఫోన్‌ తీసుకున్నాడని వివరించాడు. ఒక నెల ఈఎంఐ కట్టి తరువాత కట్టకపోవడంతో ఫైనాన్స్‌ సిబ్బంది తన ఇంటికి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపాడు. దీనిపై రవికాంత్‌ను ప్రశ్నించగా దురుసుగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అర్జీదారుల సమస్యలు ఆలకించిన

జిల్లా ఎస్పీ కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement