
అనుమానంతో భార్య చేయి నరికిన భర్త
మేడికొండూరు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం మత్తులో కత్తిపీటతో ఆమె చేయి నరికిన ఘటన జరిగింది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలవర్తిపాడు గ్రామానికి చెందిన దాసరి రాజు నిత్యం మద్యం తాగి వచ్చి తన భార్య దాసరి రాణిపై అనుమానంతో వేధిస్తూ ఉంటాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న కత్తిపీటతో రాణి కుడిచేతిని నరికేశాడు. రాణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొని సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంతలో రాజు నరికిన చేతిని ఒక సంచిలో వేసుకుని, 108 అంబులెన్స్ సహాయంతో బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించాడు. రాజుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మేడికొండూరు మండలం వెలవర్తిపాడులో ఘటన