
శతాధిక వృద్ధురాలి అప్పమ్మ మృతి
దాచేపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మందపాటి రమేష్‌రెడ్డి తల్లి అప్పమ్మ(103) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో అప్పమ్మ పాల్గొన్నారు. ఆమైపె నిర్బంధం ఉండడంతో రెండేళ్లపాటు అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపారు. అప్పమ్మ భర్త అప్పిరెడ్డి నడికుడి మేజర్ పంచాయతీ సర్పంచిగా పదేళ్లపాటు పనిచేశారు. అప్పమ్మ కోడలు, రమేష్‌రెడ్డి భార్య విజయశ్రీ కూడా నడికుడి సర్పంచిగా ఐదేళ్లపాటు పనిచేశారు. అప్పమ్మకి ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు నివాళి
అప్పమ్మ భౌతికకాయాన్ని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సందర్శించారు. రమేష్‌రెడ్డిని పరామర్శించారు. మిర్యాలగూడెం శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, అద్దంకి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్‌బాబు, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందుల జాను, జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల ప్రకాష్‌రెడ్డి, నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్, బుర్రా విజయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.