
స్కూల్ గేమ్స్ కరాటే జట్లు ఎంపిక
ఎంపికై న బాలురు, బాలికల జట్ల సభ్యులు
నరసరావుపేట ఈస్ట్: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–14, 17 బాలబాలికల కరాటే జట్ల ఎంపిక పోటీలను పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సతైనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్‌బాబు, మహిళా కార్యదర్శి వి.పద్మావతి పోటీలను ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి 250 మంది పోటీ పడ్డారు. ఎంపికై న వారి వివరాలను జిల్లా ఎన్.సురేష్‌బాబు, పద్మావతి ప్రకటించారు.

స్కూల్ గేమ్స్ కరాటే జట్లు ఎంపిక