
పేదల కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ
నగరంపాలెం: భూమి, భుక్తితోపాటు వెట్టి నుంచి విముక్తి కోసం పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ అని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మహిళలపై చిన్నచూపు కనబరిచే ప్రతి ఒక్కరికీ ఆమె పోరాటం కనువిప్పు కలిగించిందని పేర్కొన్నారు. పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిందన్నారు. పేదల విముక్తి కోసం పోరాడిన వీరనారిగా కొనియాడారు. భూమి కోసం సాహించిన తొలి మహిళని చెప్పారు. కార్యక్రమంలో అరవింద్, వసంత్, పోకల వెంకటేశ్వర్లు, కొల్లూరు శివప్రసాద్, సుబ్బు, దుర్గాదేవి, బద్రి, గౌరీశంకర్, కిశోర్, శంకర్ పాల్గొన్నారు.