
పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యత
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం తదితర 111 ఫిర్యాదులు అందాయి.