
భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట: భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా మూడో మహాసభలను కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్ర కార్యాలయంలోని సయ్యద్ సైదా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులునాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘ జెండాను జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు ఆవిష్కరించారు. జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా అవ్వారు ప్రసాదరావు, అధ్యక్షులుగా కోట ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి శిలార్ మసూద్, కోశాధికారిగా రామిశెట్టి ఆంజనేయులు ఎన్నికయ్యారు. వారికి సీఐటీయూ నాయకులు అభినందనలు తెలియచేశారు. డి.శివకుమారి, నాయకులు పాల్గొన్నారు.