
ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్‌కు ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవిని కలసి ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూర్, మధురై, చైన్నె, తంజావూర్, సేలం, తిరుత్తణి, కంచి, చిదంబరం ప్రాంతాల నుంచి తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. జనవరి 3వ తేదీన ఉదయం 10గంటలకు జ రిగే మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ఠ అతిథిగా పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సు ముఖత చూపారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.
నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన బార్ పాలసీపై కొంత మంది తమ స్వార్థంతో, ఇతరులు కొత్తవారు బార్ బిజినెస్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు బార్ పాలసీపై చెడు ప్రచారం చేస్తున్నారని అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలియజేశారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 53 మంది, పల్నాడు జిల్లాలో 24 మంది బార్ లైసెన్సులు తీసుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15న కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్‌కు ఆహ్వానం