
సూర్యఘర్ ఇనస్టలేషన్ పూర్తిచేయండి
బ్యాంకులు ’సూర్యఘర్’ రుణాలు మంజూరు చేయాలి ఎంపీ లావు, కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: జిల్లాలో పీఎం సూర్యఘర్ ద్వారా నమోదు చేసుకున్న 90 వేలు కుటుంబాలకు నెలరోజుల్లోగా సౌర ప్యానెళ్లు ఇన్‌స్టాల్ చేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇళ్లకు వెండార్ల ఎంపిక వెంటనే పూర్తిచేయాలన్నారు. గ్రామానికి వంద కుటుంబాలు లక్ష్యం చేసుకుని, ఒక్కో గ్రామాన్ని ఒక్కో వెండర్‌కు అప్పగించడం ద్వారా పనులు పూర్తిచేయాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పీఎం సూర్యఘర్ పథకంపై విద్యుత్ శాఖ అధికారులు – వెండర్స్‌తో ఎంపీ, కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ సూర్యఘర్ పథకానికి బ్యాంకు రుణం కోరే ప్రజలకు సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా రుణాలివ్వాలన్నారు. సరైన రిజిస్ట్రేషన్లు లేని ఇళ్లకు ఇంటి పన్ను రసీదు ఆధారంగా రుణం మంజూరు చేయాలన్నారు. డీసీఆర్‌బీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, విద్యుత్ శాఖ అధికారి డాక్టర్. కె.విజయకుమార్, వెండార్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.