
మత్స్యకారులు నిబంధనలను పాటించాలి
సత్రశాల(రెంటచింతల): సత్రశాల వద్దనున్న కృష్ణానదిలో చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులు కచ్చితంగా నిబఽంధనలను పాటించాలని జిల్లా అధికారి ఎస్.సంజీవ్‌రావు అన్నారు. గురువారం సత్రశాలలో నాగార్జునసాగర్ (రైట్ బ్యాంక్) సత్రశాల మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ జలాశయానికి ప్రస్తుతం వరద ఉధృతంగా వచ్చి చేరుతుండటంతో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు. మత్స్యకారులు సత్రశాల ప్రాంతంలో వేట కొనసాగించడంతో స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. ఇటీవల వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జూన్ 30వ తేదీ నాటికి మత్స్యకారులకు ఇచ్చిన అనుమతుల గడువు పూర్తి అయిందని సంజీవ్‌రావు పేర్కొన్నారు. అనుమతి పొందిన ప్రాంతంలోనే ఎవరైనా చేపట వేటకు వెళ్లాలన్నారు. లేదంటే అనుమతులను రద్దుచేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కారంపూడి సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ దొప్పటపూడి మేరికనకం, ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున, మాచర్ల మత్స్యశాకాధికారి శ్రీనివాసరావు, మత్స్యకారులు పాల్గొన్నారు.