
మహాగణపతికి ప్రత్యేక పూజలు
గుంటూరు రూరల్: నగర శివారు ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 99 అడుగుల మట్టి మహాగణపతికి శ్రీశైల దేవస్థానం నుంచి తెచ్చిన 36 అడుగుల వరి కంకుల గజమాలను బుధవారం అలంకరణ చేశారు. సింగంశెట్టి సుబ్బారావు దంపతులు వరి కంకుల గజమాలను తెచ్చి స్వామివారికి అలంకరింపజేశారు. సౌత్ డీఎస్పీ భానోదయ బుధవారం స్వామి వారిని దర్శించుకుని, పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు గుంటూరు జిల్లాకు చెందిన భక్తుడు ఆలపాటి సురేష్ రూ.10,11,111 విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన డీడీని బుధవారం సాయంత్రం తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి స్వయంగా అందజేశారు.