
చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా శివదుర్గారావు
ఏపీ చేనేత సహకార సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన కట్టా శివదుర్గారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఫణిదం చేనేత సహకార సంఘం భవన్ ఆవరణలో బుధవారం జరిగిన ఏపీ చేనేత సహకార సంఘం పల్నాడు జిల్లా మూడో మహాసభలో 10 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులుగా బిట్రా పానకాలు, పంతంగి ప్రభాకర్, గడ్డం సుసులోవ్, గనికపూడి ఏసురత్నం, వలపర్ల దిబ్బయ్య, మోపపర్తి బాబురాజు, మల్లాల గురవయ్య, సాముల నాగలక్ష్మిలను ఎన్నుకున్నారు.

చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా శివదుర్గారావు