
పిడుగురాళ్లలో వందేభారత్‌ను ఆపాలి
పిడుగురాళ్ల: వందే భారత్‌కు స్టాపింగ్ కల్పించాలంటూ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ మెంబర్ జూలకంటి శ్రీనివాసరావు విన్నవించారు. సికింద్రాబాద్‌లో బుధవారం జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే 75వ జెడ్‌ఆర్‌యూసీసీ మీటింగ్‌లో రైల్వే అధికారులకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. పిడుగురాళ్ల స్టేషన్‌లో వందే భారత్, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్, భావ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లు ఆగే లా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలు మార్గంలో కొత్తగా రైళ్లు నడపాలని, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల రద్దీ ఎక్కుగా ఉందని బోగీల సంఖ్య పెంచాలని కోరానన్నారు. పిడుగురాళ్ల – నడికుడి రైల్వే స్టేషన్ల మధ్య గడిచిన నెలల్లో దోపిడీలు పలు మార్లు జరిగినందున ప్రయాణికులకు భద్రత పెంచాలని, రైల్వే పోలీసుచే రాత్రిళ్లు గస్తీ ఏర్పాటు చేయాలని సమావేశం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీ వత్సవకు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.