
డీఆర్‌ఎం కార్యాలయంలో సోలార్ ప్లాంట్
ప్రారంభించిన డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించడం సంతోషదాయకమని డివిజన్ డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలంలో రోజు వారీ విద్యుత్ వినియోగంలో గణనీయమైన భారాన్ని తీర్చడానికి సోలార్ ప్లాంట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. అనంతరం ప్లాంట్ నిర్మాణం కోసం కృషి చేసిన సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఎం.రవితేజ, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా యడ్ల సత్యవతి
బాపట్ల: బాపట్ల జిల్లాలో ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా యడ్ల సత్యవతి ఎంపికయ్యారు. ఏవీవీ హైస్కూలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న యడ్ల సత్యవతిని ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేయటంతో ఆజాద్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూలు సిబ్బంది అభినందించారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా వీరాంజనేయులు
బల్లికురవ: గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడుగా మండలంలోని కొప్పరపాలెం ఉన్నత పాఠశాల ఎస్జీటీ గాలం వీరాంజనేయులు ఎంపిక చేశారు. ఈమేరకు ఎంఈవో 1,2 శ్రీనివాసరావు, రమేష్‌బాబు మంగళవారం తెలిపారు. మండలంలోని వైదన గ్రామానికి చెందిన వీరాంజనేయులు 2008లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి కూకట్లపల్లి, కొటావారిపాలెం, పాతమల్లాయపాలెంలోని పాఠశాలలో విద్యాభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారన్నారు. జిల్లాలో ఎంపికై న 33 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్లో బల్లికురవ మండలానికి స్థానం దక్కిందన్నారు. ఎంఈవోలతోపాటు ఎంపీడీవో కుసుమ కుమారి, పాఠశాల హెచ్‌ఎం కోటినాగులు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు ఉపాధ్యాయులు ఆయన్ను అభినందించారు.

డీఆర్‌ఎం కార్యాలయంలో సోలార్ ప్లాంట్

డీఆర్‌ఎం కార్యాలయంలో సోలార్ ప్లాంట్