
టెన్నికాయిట్ జిల్లా జట్ల ఎంపిక
నరసరావుపేట రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లా టెన్నికాయిట్ సీనియర్ సీ్త్ర, పురుషుల జట్ల ఎంపిక పోటీలు లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో మంగళవారం నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో ఇరు జట్లను ఎంపిక చేశారు. పురుషుల జట్టులో డి.కోటేశ్వరరావు, పి.ఆంజనేయులు(నకరికల్లు), ఆర్.సాయిగణ్‌ష్, వి.వీరతేశ్వర్ (శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్), మహిళల జట్టులో జె.సిరివల్లి, టి.నవ్య(కేజీబీవీ, నాదెండ్ల), బి.వైశాలి(నకరికల్లు), బి.రాజ్యలక్ష్మి (రాజుపాలెం)లు ఎంపికయ్యారు. ఎంపికై న జట్లు ఈనెల 13, 14వ తేదీలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. పోటీలను అసోసియేషన్ అధ్యక్షడు నిడికొండ జానకీరామయ్య పర్యవేక్షించారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా పి.తిరుపతిరావు, సిహెచ్ పుల్లయ్య, జి.ఝాన్సీరాణి, ఎన్.రాణి, పి.రమాదేవిబాయ్, లక్ష్మీతిరుపతమ్మలు వ్యవహరించారు.