సదా స్మరామీ | - | Sakshi
Sakshi News home page

సదా స్మరామీ

Sep 3 2025 4:31 AM | Updated on Sep 3 2025 4:31 AM

సదా స

సదా స్మరామీ

సంక్షేమ ప్రదాత సదా స్మరామీ వాడవాడలా ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి

జిల్లా వ్యాప్తంగా దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు రాజన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు

సంక్షేమ ప్రదాత

సాక్షి, నరసరావుపేట: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు పల్నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. సేవా కార్యక్రమాలలో భాగంగా అన్నదానాలు, వస్త్రదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

ప్రజల గుండెల్లో సజీవం

మహనీయులకు మరణం ఉండదని, ప్రజల గుండెల్లో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పటికీ కొలువై ఉంటారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీబైక్‌ ర్యాలీగా బయలుదేరి భాస్కర్‌ సెంటర్‌లోని డాక్టర్‌ వైఎస్సార్‌, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, 108, 104, ఇందిరమ్మ ఇళ్లు వంటి ఎన్నో పథకాలను వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారని గుర్తుచేశారు.

అభివృద్ధి ప్రదాత

2004 నుంచి 2009 వరకు చేసిన అభివృద్ధిని చూసి రాష్ట్ర ప్రజలు ఓటు వేయాలని గర్వంగా చెప్పి రెండవసారి కూడా ముఖ్యమంత్రి అయిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పిడుగురాళ్లలో జరిగిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో కాసు మహేష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ బిర్యానీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని అంజిరెడ్డి హాస్పటల్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ భారీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

వైఎస్సార్‌ ఆశయ సాధనకు కృషి

వినుకొండ పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పార్టీ పీఏసీ మెంబరు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం, 108, 104 వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగించారన్నారు.

వ్యవసాయాన్ని పండుగ చేశారు

అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రదాత, వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలోనే నడచి ఆయన ఆశయాలను వైఎస్సార్‌ సీపీ ముందు కు తీసుకెళ్తుందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. మంగళవారం దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా క్రోసూరు నాలుగు రోడ్ల కూడలిలోని వైఎస్సార్‌ విగ్రహానికి శంకరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో మహానేత ఆశయాలను సాధిస్తామని నంబూరు శంకరరావు అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మాట తప్పని.. మడమ తిప్పని నేత

పేదల సంక్షేమానికి కట్టుబడి జనరంజక పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి వర్ధంతి మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గవ్యాప్తంగా వాడవాడలా నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. పలు చోట్ల అన్న సంతర్పణలు నిర్వహించారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్సార్‌ అని గజ్జల కొనియాడారు.

పేదల సంక్షేమానికి తపించారు

పేదల గుండెల్లో వైఎస్సార్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని, అటువంటి మహనీయుడికి ఘన నివాళులర్పించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమా అన్నారు. మంగళవారం మాచర్ల నియోజక వర్గంలోని పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంతంలోని దివంగత సీఎం వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమా, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం తపించిన మహనీయుడు వైఎస్సార్‌ అన్నారు. ఆయన ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేసిన మహనీయుడిగా వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.

ఆదర్శవంతమైన పరిపాలన అందించి పాలకులకు స్ఫూర్తి నిచ్చిన నాయకుడు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకొని నరసరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో వందలాది పార్టీ శ్రేణుల మధ్య గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్‌ ప్రతిమకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని రామిరెడ్డిపేట సెంటర్‌లో ని వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడ సుమారు మూడు వేలమందికి అన్నదానం నిర్వహించారు.

సదా స్మరామీ1
1/1

సదా స్మరామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement