నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారినుంచి 92 అర్జీలను జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ మురళిలతో కలిసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా అర్జీల పరిష్కారతీరు ఉండాలన్నారు. ఆర్డీఓ కె.మధులత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి అరుణ్‌బాబు
దళితులకు సొసైటీ పేరుతో కేటాయించిన 416 ఎకరాల్లో జీఓ 270 ప్రకారం ఏపీఎండీసీకి కేటాయించిన 223 ఎకరాల భూముల్లో నాలుగేళ్ల నుంచి ఎటువంటి పనులు చేపట్టలేదు. ఆ భూములపై జిల్లా కలెక్టర్‌కు పూర్తి అధికారం ఉంది. మిగిలిన 193 ఎకరాలతో కలిపి సొసైటీ సభ్యులు అందరికీ వ్యక్తిగత పట్టాలు మంజూరు చేయండి. సాగు చేసుకుంటున్న దళిత రైతులకు అధికారుల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడండి.
–ఎస్సీ, ఎస్టీ రైతులు, యడవల్లి
గ్రామంలో బొడ్డురాయికి సమీపంలోని నా ఇంటి ముందు పదేళ్ల క్రితం పంచాయతీ నిధులతో వేసిన సీసీ రోడ్డుపై మా పక్కింటి ఇంటియజమాని సాంబశివరావు నన్ను, కుటుంబ సభ్యులను నడవనీయకుండా అడ్డుకుంటున్నాడు. నడిస్తే దూషిస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకొని నాకు రోడ్డుపై నడిచే అవకాశం కల్పించండి.
– చల్లా శ్రీనివాసరావు, ములకలూరు, నరసరావుపేట మండలం
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం