
సూపర్ సిక్స్ సభకు ప్రైవేట్ స్కూల్ బస్సులు
●నేడు పిడుగురాళ్లలో అన్ని ప్రైవేట్ స్కూళ్లకు సెలవు
●మంత్రులు రాకతో హడావుడి
సాక్షి టాస్క్ ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి సీ్త్ర శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఇచ్చిన హామీకి భిన్నంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటికి 15 రోజులు గడిసింది. అయితే సూపర్‌సిక్స్– సూపర్ హిట్ పేరుతో స్థానిక ప్రజాప్రతి నిధి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీ సభ ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు హాజరు కానున్నారు.
ప్రైవేటు స్కూళ్లకు సెలవులు..
పల్నాడు జిల్లాలోని గురజాల నియోజక వర్గంలో సీ్త్ర శక్తి పథకం ప్రారంభోత్సవంలో భాగంగా పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు జనసమీకరణకు ప్రైవేట్ స్కూలు బస్సులు ఉపయోగించనున్నారు. అందుకు అనుగుణంగా పాఠశాలలకు సెలవు ఇప్పించారు. ఓ పక్క మేము ఉచిత బస్సు ఇచ్చాం అందరూ ఫ్రీగా బస్సు ఎక్కండి, ఆధార్ కార్డు చూపించండి అని చెబుతూ ఈ ప్రైవేట్ స్కూల్ బస్సును ఎందుకు వాడుతున్నారు అని నియోజవర్గ ప్రజలు నిలదీస్తున్నారు.
స్కూల్ సెలవుపై తల్లిదండ్రులు ఆవేదన..
ఆగస్టు నెలలో సుమారు పది రోజులు విద్యార్థులకు సెలవులు వచ్చాయి.. దీంతో చదువులకు ఆటంకం కలిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలా అనధికారికంగా సెలవులు ఇస్తే ఎలా అని, సెప్టెంబర్‌లో దసరా సెలవులు కూడా వస్తున్నాయని, దీంతో చదువు ఎలా సాగుతుందని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.