
అరకొరగా ‘సుఖీభవ’..అన్నదాత దుఃఖీభవ!
సాక్షి, నరసరావుపేట: అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశామని కూటమి ప్రభుత్వం డప్పుకొడుతుండగా, మరోవైపు రైతులు మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని అర్హతలుండి కొందరికి అన్నదాత సుఖీభవ నగదు జమకాలేదు. మరికొందరికి అయితే రూ.5 వేలు, రూ.2 వేల చొప్పున బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. పీఎం కిసాన్ నిధులు ఎందుకు పడలేదో చెప్పేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 2.80 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించారు. అఽధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండో ఏడాది అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలను రాష్ట్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ ద్వారా రూ.2 వేలను ఖాతాలలో జమ చేశామని ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. ఇందులో అన్నదాత సుఖీభవ పథకానికి 2,40,530 మంది అర్హులని అధికారులు ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 40 వేల మంది ఇందులో తగ్గారు.
పీఎం కిసాన్ మాత్రమే..
ఈకేవైసీ, 1బీ మ్యూటేషన్ కాలేదని, ఫ్యామిలీ మ్యాపింగ్ అంటూ వివిధ కారణాలతో గత ప్రభుత్వంతో పోల్చితే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు. పోని వీరికై నా రూ.7 వేలు జమ అయ్యాయా అంటే అది లేదు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా జిల్లాలో కేవలం 2,04,738 మందే అర్హత సాధించారు. వీరికే కేంద్రం ఇస్తున్న రూ.2 వేలు జమ అయ్యాయి. 35,792 మంది రైతులు అన్నదాత సుఖీభవ పొంది పీఎం కిసాన్‌కు దూరమయ్యారు.

అరకొరగా ‘సుఖీభవ’..అన్నదాత దుఃఖీభవ!

అరకొరగా ‘సుఖీభవ’..అన్నదాత దుఃఖీభవ!