
పెట్రోల్ కల్తీపై అధికారుల తనిఖీ
మాచవరం: స్థానిక ఇండియన్ ఆయిల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులుగా నీళ్లు రావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత వాహనాలు నిలిచిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఆయిల్ ట్యాంక్‌లో నీళ్లు చేరడంతో ఇంజిన్లు పాడైపోయాయని మెకానిక్‌లు చెప్పడంతో బంక్ వద్దకు చేరి నిర్వాహకులను నిలదీశారు. బంక్‌లోని ఓ పైపు నుంచి నీళ్లు రావడాన్ని గమనించి, అధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం పెట్రోల్ బంక్‌ను డీఎస్‌వో ప్రసాదరావు, అధికారులతో కలిసి పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. పెట్రోల్ శాంపిల్‌ను సేకరించి ఉన్నతాధికారులకు పంపించారు. ఈ సందర్భంగా డీఎస్‌వో ప్రసాదరావు మాట్లాడుతూ బంక్‌లోని ఓ పైపు నుంచి నీళ్లు రావడం వాస్తవమేనని, మరోపైపు సక్రమంగానే ఉందని తెలిపారు. వ్యత్యాసాలను గమనించి నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు చెప్పారు. ఆదివారం సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పరిశీలిస్తారని, కల్తీ జరిగినట్లు నిరూపణ అయితే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, డీటీలు ప్రభాకర్‌రావు, స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.