
హీనంగా చూస్తున్నారు
పొగాకు రైతులను అధికారులు , బయ్యర్లు హీనంగా చూస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా అవమానకరంగా మాట్లాడుతున్నారు. మేం ఇచ్చేది ఇంతే మీ ఇష్టమైతే అమ్మండి.. లేదంటే తీసుకెళ్లండని నిర్మొహమాటంగా చెబుతున్నారు. నేను శిరిగిరిపాడు నుంచి పొగాకు ఇక్కడికి తెచ్చాను. నాకు ఖర్చు రూ. 6వేలు వచ్చింది. నేను తెచ్చిన వాటిల్లో రెండే బేళ్లు కొంటామని మిగతావి వెనక్కి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఖర్చులన్నిటినీ మేం ఎలా భరించాలి?
– లింగిరెడ్డి కృష్ణారెడ్డి, శిరిగిరిపాడు