
అమ్మో.. తొలి ఏకాదశి?!
వినుకొండ: తొలిఏకాదశి వినుకొండ వాసులకు పెద్ద పండుగ. సంక్రాంతి తరువాత ఇళ్లన్నీ కళకళలాడేది ఈ పర్వదినం నాడే. బంధువులు, స్నేహితులు, కన్నబిడ్డలు ఇలా.. ఒకరేమిటి బంధుగణమంతా ఎక్కడ ఉన్నా.. ఇక్కడి తమ వారిండ్లకు తరలివచ్చి తొలిఏకాదశి పర్వదినాన్ని ఆస్వాదించి మరునాడు తిరిగి ఎవరిళ్లకు వారు వెళ్లే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. మెట్ల మీదుగా కొండపైకి వెళ్లి స్వామిని దర్శించి పరవశించే వారు. చుట్టపక్కల గ్రామాల నుంచే కాకుండా లక్ష మందికి పైగా భక్తులు వినుకొండకు పెద్ద ఎత్తున తరలివస్తారు. కానీ ఇవాళ ఈ పండుగ పేరు చెబితేనే స్థానికుల్లో వణుకు పుడుతోంది. ఎందుకంటే, గత ఏడాది ఇదే పర్వదినం నాడు జరిగిన ఘటనే ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన రషీద్ అనే యువకుడిని రోడ్డుపైనే అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యలో 29 మందిని నిందితులుగా గుర్తించారు. గతంలో కూడా తొలిఏకాదశి పండుగ రోజునే పలు చెదురు మదురు ఘర్షణలు జరిగాయి. అయితే ఈ ఏడాది ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరగాలని పట్టణ వాసులు కోరుకుంటున్నారు.
పర్వదినం రోజున వినుకొండలో
ఏదోక ఘర్షణ
గత ఏడాది ఇదేరోజున రషీద్ హత్య
పట్టణంలో పటిష్ట భద్రత
42 మందిపై బైండోవరు కేసులు
82 సీసీ కెమెరాలు,
పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు
400 మంది పోలీసులతో భద్రత