
● సివిల్ వ్యవహారంలో డబ్బుల దగ్గర వివాదం ● ఇద్దరు న్
ఇండోర్ ఆడిటోరియం స్టేడియం ప్రారంభం
సత్తెనపల్లి: సత్తెనపల్లిలో ఇండోర్ ఆడిటోరియం స్టేడియాన్ని బుధవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సుమారు 50 వేల ఎకరాలు అభివృద్ధి చేసి దానిలో 2,500 ఎకరాలు అంతర్జాతీయ క్రీడా మైదానానికి కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. తొలుత స్టేడియాన్ని ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. స్టేడియానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్, గ్రౌండ్, ప్రహరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వాటికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వినతి పత్రం అందించారు. నూతనంగా ప్రారంభించిన కోర్ట్‌లో బ్యాడ్మింటన్ ఆడారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీఓ జీవీ రమణాకాంతరెడ్డి పాల్గొన్నారు.
న్యాయవాదిపై మరో న్యాయవాది దాడి
వినుకొండ: సీనియర్ న్యాయవాదిపై మరో సీనియర్ న్యాయవాది దాడి చేసి, దుర్భాషలాడిన ఘటన వినుకొండ పట్టణంలో న్యాయస్థానం ముందు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామ పరిధిలోని భూమికి సంబంధించి సివిల్ దావా ఒకటి వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నడుస్తోంది. అయితే, పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది ఆ దావాను కొంత కాలం నుంచి తన క్లయింట్ తరఫున వాదిస్తూ వచ్చాడు. తనకు ఆ కేసును ఇచ్చినట్లయితే రాజీ చేసి, ప్రతిఫలం ముట్టచెబుతా అని మరో సీనియర్ న్యాయవాది దావాను చేజిక్కించుకున్నాడు. అదేమని అడిగితే కోర్టు గేటు ముందే దాడి చేశాడు. అయితే, న్యాయవాదులు ఇద్దరూ కూటమికి చెందిన వారే కావడం విశేషం. ఈ గొడవ బయటకు పొక్కడంతో పట్ణణ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. న్యాయవాదులు సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కూటమి ప్రభుత్వం పరువు తీస్తున్నారని ఆ పార్టీలో కూడా చర్చ జరగడం విశేషం.ఇంత జరిగినా దాడిపై న్యాయవాది ఫిర్యాదు చేయకపోవడం విశేషం.